Bandi Sanjay Kumar : కేసీఆర్ ఆరోగ్యంపై నాకున్న శ్రద్ధ కేటీఆర్కు లేదు : బండి సంజయ్

Byline :  Krishna
Update: 2023-10-11 09:31 GMT

తెలంగాణలో బీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని బండి సంజయ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కేంద్ర నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని చెప్పారు. కానీ కేసీఆర్ సర్కార్ సొమ్ము ఒకరిది.. సోకు ఇంకొకరిది అన్నట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ కల్లబొల్లి కబుర్లను ప్రజలు నమ్మడం లేదని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు.

బీజేపీకి రాష్ట్రంలో గ్రాఫ్​ తగ్గిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని (Bandi Sanjay Kumar)బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అదేవిధంగా తాను బీఆర్​ఎస్​కు​ ఓటు వేయమని ప్రచారం చేస్తున్నట్లు వచ్చిన వార్తపైనా సంజయ్​ స్పందించారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలిస్తే బీఆర్ఎస్కు ఓటేయమని చెప్పానని.. కానీ ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ మేనిఫెస్టో చూసి విపక్షాలకు దిమ్మ తిరుగుతుందని ఆ పార్టీ నాయకులు చెప్పడం జోక్​గా​ ఉందని విమర్శించారు.

2019లో బీఆర్​ఎస్​ మేనిఫెస్టో ఎంత వరకు అమలు చేశారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దీనిపై చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. బీజేపీ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉన్నది వాస్తవం కాదా అని అడిగారు. కేసీఆర్ ఆరోగ్యంపై తనకు ఉన్న శ్రద్ధ కేటీఆర్కు లేకపోవడం బాధాకరమన్నారు. కేసీఆర్​ ఆరోగ్యం బాగుండాలన్న బండి.. ఏవైనా ఉంటే రాజకీయ పరంగా చూసుకుంటామని చెప్పారు.   

 


 


Tags:    

Similar News