తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. మొన్నటి మోదీ సభతో ఆ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఎన్నికల ముందు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ప్రకటించి పొలిటికల్ హీట్ను పెంచింది. మరోవైపు వరుస సభలతో ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.
తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందని సంతోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీలో అధికారంలో ఉంటుందన్నారు. సోషల్ మీడియాలో కథనాలను నమ్మాల్సిన పనిలేదని చెప్పారు. ఎన్నికల్లో పోటీచేయాలనుకనేవాళ్లు ప్రజల్లో ఉండాలని.. అనవసరంగా నేతల చుట్టూ తిరగొద్దని సూచించారు. టికెట్ల నిర్ణయం ఢిల్లీలో కాదని ఇక్కడే ఉంటుందని స్పష్టం చేశారు. కాబట్టి నేతలంతా ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉండాలని చెప్పారు.