Kishan Reddy : ఎస్సీ వర్గీకరణను గతంలో ఎవరూ సీరియస్గా తీసుకోలేదు - కిషన్ రెడ్డి

Byline :  Kiran
Update: 2023-11-13 11:10 GMT

ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏండ్లుగా పోరాటం కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణపై గత ప్రభుత్వాలేవీ చిత్తశుద్ధితో పనిచేయలేదని విమర్శించారు. ఎన్నో కమిటీలు వేశాయని అన్నారు. ఏ ప్రధాని కూడా ఎస్సీ వర్గీకరణపై సీరియస్‌గా చర్చించలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై అన్నీ పార్టీలు కంటితుడుపు చర్యగా ప్రవర్తించాయని, ఎస్సీ వర్గీకరణ ఆలస్యం కావడం వెనుక మొదటి ముద్దాయి కాంగ్రెస్‌ పార్టీనే అని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం తుషార్‌ మెహతా కమిటీ వేసి ఆ తర్వాత పట్టించుకోలేదని మండిపడ్డారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆ కమిటీ ఇచ్చిన నివేదికను కనీసం చదవలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.

ఎస్సీ వర్గీకరణ అంశంపై మందకృష్ణ మాదిగ జులైలో ప్రధాని మోడీని కలిశారని కిషన్ రెడ్డి చెప్పారు. ఆగస్టులో ఎమ్మార్పీఎస్‌ నాయకులను అమిత్‌ షా ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై గతంలో సుప్రీంకోర్టు రెండు రకాలు తీర్పులు ఇచ్చిందని ఒక ధర్మాసనం వర్గీకరణకు మద్దతుగా.. మరొకటి వద్దని తీర్పు ఇచ్చిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.




Tags:    

Similar News