Revanth Reddy : కామారెడ్డిలో హైటెన్షన్.. రేవంత్ రెడ్డిని అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు
సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. కొడంగల్ లో ఓటేసిన రేవంత్ రెడ్డి.. పోలింగ్ ప్రక్రియ చూసేందుకు కామారెడ్డికి చేరుకున్నారు. పోలింగ్ స్టేషన్లను విజిట్ చేస్తుండగా.. రేవంత్ ను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. రేవంత్ గో బ్యాక్ అంటు నినాదలు చేశారు. దీంతో కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. అది గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. దీంతో కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో, అక్కడి పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కామారెడ్డిలో కేసీఆర్ ఏం చేస్తారో చూద్దామని బదులిచ్చారు. పోలింగ్ స్టేషన్ల విజిట్ కు వస్తే బీఆర్ఎస్ బాధ ఏంటో తనకు అర్థం కావట్లేదని అన్నారు. ఓటమి భయంతో బీఆర్ఎస్ శ్రేనలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదని మండిపడ్డారు.