TS Assembly Elections 2023 : బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం - చంటి క్రాంతి కిరణ్
Byline : Kiran
Update: 2023-10-16 16:16 GMT
థంబ్ : మళ్లీ అవకాశమిస్తే ఇంకా అభివృద్ధి చేస్తా
రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. ఎమ్మెల్యేగా తనకు మరోసారి అవకాశమిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. జోగిపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించిన అనంతరం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని క్రాంతి హామీ ఇచ్చారు.
అంతకు ముందు చౌట్కూర్, కిష్టాపూర్, అల్లాదుర్గ్ మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.