BRS Documentary : అప్పుల ప్రచారాన్ని తిప్పికొట్టేలా.. కాంగ్రెస్‌కు BRS కౌంటర్!

Byline :  Veerendra Prasad
Update: 2023-12-20 05:03 GMT

అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదలకు కాంగ్రెస్ సిద్ధమవుతున్న వేళ బీఆర్ఎస్ కౌంటర్‌గా ఆస్తులపై బుధవారం డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. పదేళ్లలో తెలంగాణలో సృష్టించిన ఆస్తులను ఆ డాక్యుమెంట్‌లో పొందుపర్చింది. కేసీఆర్ హయాంలో సృష్టించిన ఆస్తులు ఇవే అని కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. గత ప్రభుత్వంలో సృష్టించిన ఆస్తుల జాబితాను విడుదల చేసింది. రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పుల ప్రచారాన్ని తిప్పికొట్టేలా బిఆర్ఎస్ ప్లాన్ రెడీ చేస్తోంది. 10 ఏళ్ల బిఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయం 151 శాతం, పన్నుల వసూళ్లు 161 శాతం పెరిగిందని పేర్కొంది.

గత ప్రభుత్వంపై రేవంత్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయనున్న క్రమంలో... అప్పులు కాదు ఆర్థిక ప్రగతి అంటూ 51 స్లైడ్స్ తో రిపార్ట్ మెంట్ల వారిగా రిపోర్టు రిలీజ్ చేసింది బీఆర్ఎస్. ప్రభుత్వం చేస్తున్న అప్పుల ప్రచారాన్ని తిప్పికొట్టేలా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఆస్తుల్లో భాగంగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టి నిర్మాణాలను ఈ డాక్యుమెంట్‌లో చేర్చారు.




Tags:    

Similar News