KCR : ఓట్ల కోసం అబద్దాల మేనిఫెస్టో ప్రకటించలేదు : కేసీఆర్‌

Byline :  Kiran
Update: 2023-10-16 11:55 GMT

బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ అధికారం కట్టబెడితే 93 లక్షల మందికి కేసీఆర్‌ బీమా అమలు చేస్తామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ ప్రకటించారు. రైతు బీమా తరహాలోనే వ్యక్తి చనిపోతే వారంలోనే రూ.5 లక్షలు వస్తాయని చెప్పారు. మళ్లీ గెలవగానే మార్చి నుంచి తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఓట్ల కోసం అబద్దాల మేనిఫెస్టో పెట్టలేదన్న కేసీఆర్.. దేశంలో ఏ సీఎంకైనా దళిత బంధు పథకం అమలు చేయాలన్న ఆలోచన వచ్చిందా అని ప్రశ్నించారు. దశాబ్దాల క్రితమే ఈ పథకం అమలు చేసి ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి ఉండేదా కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నందు వల్లే భారీగా పెట్టుబడులు వస్తున్నాయని కేసీఆర్‌ అన్నారు. గత 9 ఏండ్లలో రాష్ట్రంలో ఎలాంటి మతకలహాలు జరగలేదని శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు. కొందరు మతం పేరుతో విభేదాలు సృష్టించాలని చూస్తున్నా వారి ప్రయత్నాలు ఫలించడంలేదని అన్నారు. గంగా జమునా తెహజీబ్కు ప్రతీక అయిన తెలంగాణలో వారి పాచికలు పారవని చెప్పారు. ఈ ఏడాది గణేశ్‌ నిమజ్జనం రోజునే మిలాద్‌ ఉన్ నబీ వస్తే.. ఎవరూ అడగకుండానే ముస్లిం మత పెద్దలు దాన్ని వాయిదా వేసుకున్న విషయాన్ని కేసీఆర్‌ గుర్తు చేశారు.




Tags:    

Similar News