TS Assembly Elections 2023 :పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన పట్నం మహేందర్ రెడ్డి

Byline :  Kiran
Update: 2023-10-18 12:56 GMT

పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి పట్నం మహేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అలాంటి ప్రచారాన్ని సహించే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. తాండూరులో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో సమావేశమైన మహేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కొడంగల్, తాండూరు, వికారాబాద్, పరిగిలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ మంత్రిగా తన వాళ్లను గెలిపించుకునే బాధ్యత తనపై ఉందని మహేందర్ రెడ్డి అన్నారు. పైలెట్ రోహిత్ రెడ్డి గెలుపు కోసం పార్టీ సీనియర్ నాయకులంతా శ్రమిస్తున్నారని స్పష్టం చేశారు. కొడంగల్‌లో పట్నం నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తాండూరు, వికారాబాద్‌కు చెందిన కొందరు బీఆర్ఎస్ నాయకులు పార్టీ మారినంత మాత్రాన తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు.




Tags:    

Similar News