TS Assembly Elections 2023 : కాంగ్రెస్ దెబ్బకు కంగుతిన్న మంత్రులు..

Byline :  Krishna
Update: 2023-12-03 07:51 GMT

తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు గట్టి షాకిచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న కారు పార్టీని కాదని బీఆర్ఎస్కు పట్టం కట్టారు. కాంగ్రెస్ దెబ్బకు అటు మంత్రులు సైతం కంగుతిన్నారు. చాలా స్థానాల్లో మంత్రులు వెనుకంజలో ఉన్నారు. గత ఆరు పర్యాయాలు పాలకుర్తిలో వరుసగా గెలుస్తూ వస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఈ సారి అక్కడి ప్రజలకు ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న యశస్విని రెడ్డి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఆమె గెలుపు దాదాపు ఖాయమైంది.

అదేవిధంగా ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సైతం వెనుకంజలో ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు 16వేల ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. ధర్మపురిలో మంత్రి కొప్పలు ఈశ్వర్ సైతం ఓటమి దిశగా వెళ్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం వెనుకంజలో ఉన్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి 12వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


Tags:    

Similar News