బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. పార్టీ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి , కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డి తమ శాసనమండలి సభ్యత్వాన్ని వదలుకున్నారు. ఈ మేరకు వారు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆయన ఛాంబర్ లో కలిసి తమ రాజీనామా లేఖలను అందజేశారు. వాటికి గుత్తా ఆమోదం తెలిపారు.
డిసెంబర్ 3న వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. జనగామ నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీ హరి, హుజూరాబాద్ స్థానం నుంచి పాడి కౌశిక్ రెడ్డి విజయం సాధించారు. దీంతో నిబంధనల ప్రకారం వారు ఎమ్మెల్సీ పదవులు వదలుకున్నారు.