KCR :మరికాసేపట్లో తెలంగాణ భవన్‌లో BRS మ్యానిఫెస్టో విడుదల
రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ మొదలైంది. (Telangana Assembly Elections 2023) ఇప్పటికే బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించింది. మేనిఫెస్టోనూ అందరి కంటే ముందే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతుంది. పార్టీ అధినేత కేసీఆర్.. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్‌లో అభ్యర్థులందరికీ స్వయంగా బీఫారాలు అందజేయనున్నారు. అనంతరం పార్టీ మ్యానిఫెస్టోను ప్రకటించనున్నారు. ప్రజల అవసరాలు తీర్చేలా, రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడేలా మ్యానిఫెస్టో తీర్చిదిద్దిన్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మ్యానిఫెస్టో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టిస్తుందని, సకల జన సంక్షేమంగా ఉంటుందని అంటున్నాయి. ఎన్నికల సందర్భంగా నేతలంతా మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, వృద్ధులు, దివ్యాంగులు, వింతతువులు.. సబ్బండ వర్గాలు హర్షించేలా మ్యానిఫెస్టో ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు రాజకీయ నిపుణులు కేసీఆర్ విడుదల చేయబోయే మేనిఫెస్టోలో ముఖ్యాంశాలివే నంటూ చెబుతున్నారు. వాటిని ఒకసారి పరిశీలిస్తే..
::
* పేద కుటుంబాల కోసం కేసీఆర్ బీమా పథకం
* నిరుపేద మహిళలకు నెలనెలా రూ.3 వేల జీవన భృతి
* ఆసరా ఫించన్లు మొత్తం రూ.3, 016 కి పెంపు
* రూ.400 వంటగ్యాస్ సబ్సిడీ
* రైతులకు ఎకరానికి 2 బస్తాల ఉచిత యూరియా
* 90 లక్షల కుటుంబాలకు రైతు బీమా వర్తింపు
* కేసీఆర్ కిట్ సాయం రూ.15వేలకు, ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితి రూ.10 లక్షలకు పెంపు
* 57 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్
* కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ సాయం రూ.1.25 లక్షలకు పెంపు
* మహిళలు, యువతకు రూ.2లక్షల మేర వడ్డీ లేని రుణాలు
* పెట్రోల్ , డీజిల్ పై రాష్ట్ర పన్ను వాటా సడలింపు
* ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థుల మాదరి బీసీ విద్యార్థులకు బోధన రుసుము చెల్లింపు
* జర్నలిస్టులకు పెన్షన్ పథకం
* సీనియర్ సిటిజన్లకు భరోసా పథకం