తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయానని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రం తమకు గుడ్ న్యూస్ చెప్తాయని ట్వీట్ చేశారు.
‘చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్ర పోయా. ఎగ్జిట్ పోల్స్ ఎలాగైనా ఉండొచ్చు. ఎగ్జాక్ట్ పోల్స్ మాత్రం మాకు గుడ్ న్యూస్‌ను చెప్తాయి’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హ్యాట్రిక్ విజయం కోసం బీఆర్ఎస్ శ్రేణులు అలుపెరగకుండా ప్రచారం నిర్వహించాయి. దాదాపు రెండు నెలలుగా ప్రతి నాయకుడు నిద్రాహారాలు మాని గెలుపు కోసం శ్రమించారు. వారిలో కేటీఆర్ కూడా ఒకరు. ఇదిలా ఉంటే గురువారం పోలింగ్ ముగిసిన తర్వాత పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అయితే ఆ ఎగ్జిట్ పోల్స్ లో చాల వరకు కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లు వస్తాయని ప్రకటించాయి. దీంతో ఆ ఎగ్జిట్ పోల్స్‌ను మంత్రి కేటీఆర్ ఖండించారు.
After a long time had a peaceful sleep 😴
— KTR (@KTRBRS) December 1, 2023
Exit polls can take a hike
Exact polls will give us good news. 👍#TelanganaWithKCR