Allola Indrakaran Reddy : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై కేసు నమోదు

Byline :  Krishna
Update: 2023-11-30 09:16 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36.68శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ క్రమంలో నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఓటేసిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఎల్లపెల్లిలో పార్టీ కండువాతో మంత్రి ఓటేశారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిర్మల్‌ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పార్టీ గుర్తులు కనిపించేలా చేయటం, ఫలనా గుర్తుకు ఓటు వేయాలని చెప్పటం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. దీంతో మంత్రిపై కేసు నమోదైంది.


Tags:    

Similar News