తెలంగాణ పోలీసులపై ఏపీలో కేసులు నమోదు

Byline :  Krishna
Update: 2023-12-02 14:12 GMT

కేంద్రం జోక్యంతో నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం డ్యామ్ సీఆర్పీఎఫ్ పర్యవేక్షణలో ఉంది. దీంతో ఇరు రాష్ట్రాల పోలీసులు డ్యాం నుంచి వెనక్కి వెళ్లారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులపై ఏపీలో కేసులు నమోదయ్యాయి. పల్నాడు విజయపురి పోలీస్ స్టేషన్లో తెలంగాణ పోలీసులపై సెక్షన్ 447, 341, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తమ విధులను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారని ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో ఈ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఏపీ పోలీసులపై తెలంగాణలో పలు కేసులు నమోదయ్యాయి.

కాగా ఇవాళ ఏపీ, తెలంగాణ అధికారులతో కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా జలాల వివాదం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ, నాగార్జున సాగర్ వద్ద నెలకొన్న ఉద్రిక్తతల అంశాలపై చర్చించారు. డిసెంబర్ 6న ఢిల్లీలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. అంతకుముందు

నాగార్జునసాగర్‌ వద్ద నవంబర్ 28కి ముందు ఉన్న స్థితినే కొనసాగించాలని తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. డ్యామ్ నిర్వహణ కేఆర్ఎంబీ చూసుకుంటుందని స్పష్టం చేసింది.


Tags:    

Similar News