Telangana Cabinet : రేవంత్ కేబినెట్లో కుల సమీకరణాలు ఇలా..

Update: 2023-12-07 07:45 GMT

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి మంత్రి వర్గాన్ని దాదాపు అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా కూర్చారు. అగ్రవర్ణాలతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాధాన్యం కల్పించారు. అయితే ముస్లిం వర్గం నుంచి ఒక్కరు కూడా లేరు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీతోపాటు ఇతర కులాలకు చెందిన మరికొంతమందికి మలివిడతలో మంత్రి పదవులను ఇచ్చే అవకాశం ఉంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్‌కు స్పీకర్ పదవి అప్పగించారు.

మంత్రుల జాబితా

రేవంత్ రెడ్డి

భట్టి విక్రమార్క (ఎస్సీ)

కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

దుద్దిళ్ల శ్రీధర్‌బాబు( బ్రాహ్మణ)

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

తుమ్మల నాగేశ్వరరావు (కమ్మ)

దామోదర రాజనరసింహ (ఎస్సీ),

దనసరి సీతక్క(ఎస్టీ)

కొండా సురేఖ(బీసీ)

పొన్నం ప్రభాకర్‌ (బీసీ)

జూపల్లి కృష్ణారావు (వెలమ)

రేవంత్ రెడ్డి సహా కేబినెట్లో 12 మంది ఉన్నారు. వీరిలో నలుగురు రెడ్లు, ఇద్దరు బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒక వెలమ, ఒక బ్రాహ్మణ, ఒక కమ్మ నేత ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డికి అవకాశం దక్కింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖలలకు అవకాశం కల్పించారు. ఉమ్మడి ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌‌లుకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి దామోదర్‌ రాజనర్సింహ, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ నుంచి జూపల్లి కృష్ణారావులను కేబినెట్లోకి తీసుకున్నారు. హైదరాబాద్ తోపాటు పార్టీ ఎన్నికల్లో ప్రభావం చూపని ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కేబినెట్లో ఎవరికీ చోటు దక్కలేదు. కేబినెట్లో మొత్తం ఎంతమందికి చోటు దక్కుతుందో ఇంకా స్పష్టం రావడం లేదు. గడ్డం వివేక్, గడ్డం వినోద్(ఎస్సీ)లో ఒకర్ని తీసుకునే అవకాశం ఉంది. బీసీ ఎమ్మెల్యేలకు కూడా చోటు కల్పించొచ్చు. కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(కమ్మ)కు మంత్రిపదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వంలో చేరాలని ఆహ్వానిస్తే ఆలోచిస్తామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. పొత్తు ఒప్పందం కింద సీసీఐకి రెండు ఎమ్మెల్సీ సీట్లు కూడా దక్కనుండడంతో ఆ పార్టీ నుంచి ఒకరిని కేబినెట్లో తీసుకునే అవకాశం ఉంది.


Tags:    

Similar News