TS Assembly Elections 2023 : కొడంగల్లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య ఘర్షణ
ఎన్నికలు దగ్గరపడుతుండడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పార్టీల మధ్య పలు చోట్ల ఘర్షణలు సైతం చోటుచేసుకుంటున్నాయి.
కొడంగల్ నియోజకర్గంలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ ఘర్షణ చెలరేగింది. జీహెచ్ఎంసీ కార్పొరేటర్ సోమశేఖర్ రెడ్డి వాహనాల్లో డబ్బులు తరలిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో సర్జఖాన్ పేటలో ప్రచారానికి వెళ్లొస్తున్న సోమశేఖర్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ శ్రేణులపై ప్రతిదాడులు చేశారు.
కోస్గిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఆందోళనకు దిగారు. ఆయనకు పోటీగా సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. అయితే కోస్గి పోలీస్ స్టేషన్ ఎదుట ఇరువర్గాల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.