CM KCR : తెలంగాణ ఇస్తానంటే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాం... సీఎం కేసీఆర్

Byline :  Veerendra Prasad
Update: 2023-11-08 09:00 GMT

ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయని... కానీ ప్రజలు ఆగమాగం కావొద్దని అన్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజల దగ్గర ఉండే ఒకే ఆయుధం ఓటు అని, ఎంతో విలువైన ఆ ఓటుతో మీకు మంచి చేసే నాయకుడిని ఎంచుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇవాళ వేసే ఓటు మీ ఐదేళ్ల తలరాతను మార్చుతుందని, వ్యక్తి గుణగణాలు, సేవా తత్పరతను చూసి ఓటేయ్యాలని అన్నారు. బుధవారం సిర్పూర్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పను గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతూ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఢోకా పార్టీ అని.. తెలంగాణ రాష్టాన్ని ఇస్తానంటే 2004 లో కాంత్రెస్ తో పొత్తు పెట్టుకున్నామని, కానీ గెలిచిన తర్వాత తెలంగాణ ఇవ్వలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేశారని.. చివరకి తెలంగాణ కోసం 2009 లో ఉద్యమించామన్నారు. బీఆర్ఎస్ పోరాటానికి భయపడి కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేక తెలంగాణ ఇచ్చారన్నారు. 2014 లో తెలంగాణను సాధించుకున్నామని.. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఒక్కో పని చేసుకుంటూ.. తెలంగాణను చక్కదిద్దుకున్నామన్నారు.

రాష్ట్రంలో తండాలకు సైతం శుద్ధమైన నీరు వస్తున్నాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పారు కేసీఆర్. ఏ ఊరిలో పండే ధాన్యాన్ని ఆ ఊరిలోనే కొంటున్నామన్నారు. మంచం పట్టిన మన్యం వార్తలు ఇప్పుడు లేవని, కోతలు లేకుండా కరెంట్ ఇస్తున్నామని, అన్ని వర్గాల కోసం గురుకులాలు పెట్టుకున్నామని చెప్పారు. తెలంగాణలో నీటి సమస్య లేదన్నారు. రైతుబంధుతో రైతులకు పెట్టుబడి బాధ లేదని.. పెట్టుబడి సాయంగా రైతు బంధు అందిస్తున్నామని చెప్పారు. రైతు హక్కుల కోసం ధరణీ పోర్టల్ తెచ్చామని.. ధరణి వచ్చాక రైతుల ఇబ్బందులన్నీ పోయాయన్నారు. కాంగ్రెస్ కారణంగా 58 ఏళ్లు కష్టపడ్డామన్నారు. కాంగ్రెస్ ఢోకా భాజీ పార్టీ అన్నారు. తాను అమరణ దీక్ష చేస్తేనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. భూములపై పెత్తానాన్ని రైతులకు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ధరణి తొలగించాలని చెబుతుందని, అలా తొలగిస్తే రైతుబంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు సిర్పూర్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని అన్నారు




Tags:    

Similar News