TS Assembly Elections 2023 : బాన్సువాడ బంగారువాడగా మారింది - సీఎం కేసీఆర్

Byline :  Kiran
Update: 2023-10-30 11:07 GMT

పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆరంభంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. కరెంట్‌, తాగు, సాగు నీరు తదితర సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించామని చెప్పారు. బాన్సువాడలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిపోయిందని కేసీఆర్ స్పష్టం చేశారు.

పిడికెడు మందితో పోరాటం మొదలుపెట్టి.. తాను చావు నోట్లో తలపెడితే రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు. మూడు నాలుగు నెలల పాటు ఆర్థికవేత్తలతో చర్చించి ముందుకుసాగమని అన్నారు. పదేళ్లలో అన్ని రంగాల్లో ఉజ్వలమైన ప్రగతి సాధించామని చెప్పారు. పోచారం శ్రీనివాసరెడ్డి హయాంలో బాన్సువాడ బంగారువాడ అయిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న ఆయనను లక్ష పైచిలుకు మెజార్టీతో మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తామని, అప్పుడు పోచారం మళ్లీ పెద్ద హోదాలో ఉంటారని హామీ ఇచ్చారు.




Tags:    

Similar News