KCR : వైఎస్ షర్మిల డబ్బు కట్టలకు తగిన గుణపాఠం చెప్పండి : కేసీఆర్

Byline :  Krishna
Update: 2023-11-13 12:43 GMT

5 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్ను నిర్ణయించే ఓటును ప్రజలు బాగా ఆలోచించి వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఐదేళ్లకోసారి వచ్చే నాయకులను నమ్మి మోసపోవద్దన్నారు. నర్సంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. గత పదేళ్ల నుంచి నర్సంపేట ప్రశాంతంగా ఉందని అన్నారు. అయితే పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వైఎస్ షర్మిల నియోజకవర్గంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.

వైఎస్ షర్మిల నర్సంపేటకు డబ్బు కట్టలు పంపి.. సుదర్శన్ రెడ్డిని ఓడించేందుకు కుట్రలు చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. అటువంటి నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. డబ్బు కట్టలు గెలవాలా.. బీఆర్ఎస్ అభివృద్ధి గెలవాలా అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. పాకాల ప్రాజెక్ట్తో యాసంగిలో లక్షా 35వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. పట్టుదలతో కృషి చేస్తేనే ఇది సాధ్యమైందని చెప్పారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే పెద్ది సుదర్శన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.


Tags:    

Similar News