CM KCR : నేడు గజ్వేల్‌, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్

Byline :  Veerendra Prasad
Update: 2023-11-09 02:18 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన నామినేషన్ల ఘట్టం ఆఖరి దశకు చేరుకుంది. శుక్రవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండటంతో.. బుధవారం ఒక్కరోజే 622 మంది నామినేషన్లు వేయగా.. మొత్తం నామపత్రాల సంఖ్య 1314కి చేరింది. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఇవాళ గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్లు వేయనున్నారు. ఉదయం 11 గంటలకు గజ్వేల్‌లో.. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్‌ వేయనున్న కేసీఆర్.. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌, సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు సహా పలువురు మంత్రునేడు గజ్వేల్‌, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్లు నామపత్రాలు సమర్పించనున్నారు. ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, హుజుర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నామినేషన్లు వేయనున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఈటెల రాజేందర్ కూడా ఈ రోజే నామినేషన్ వేస్తున్నారు. హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఈ ఉదయం ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రం నుంచి హెలీక్యాప్టర్‌లో ముందుగా గజ్వేల్‌ చేరుకొని నామినేషన్‌ వేస్తారు కేసీఆర్. నామినేషన్‌ దాఖలు చేసిన అనంతరం హెలికాప్టర్‌లో కామారెడ్డికి చేరుకోనున్నారు. మొదటగా నామినేషన్‌ వేసేందుకు ఆర్డీవో కార్యాలయానికి ముఖ్యనాయకులు, కార్యకర్తలతో కలిసి తరలి వెళ్లనున్నారు. అనంతరం డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద బహిరంగసభలో కేసీఆర్‌ పాల్గొంటారు. లక్ష మందిని ఈ సభకు తరలించేందుకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఆధ్వర్యంలో పార్టీశ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. కేసీఆర్‌ పర్యటన దృష్ట్యా పోలీసులు పట్టణంతో పాటు సభాప్రాంగణం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలను పార్కింగ్‌ చేసి ట్రాఫిక్‌కు అంతరాయం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఇక కామారెడ్డి బహిరంగ సభ తర్వాత సీఎం కొంత విరామం తీసుకోనున్నారు. దీపావళి సందర్భంగా కొంత గ్యాప్ తర్వాత నవంబర్ 13 నుండి తిరిగి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 28న గజ్వేల్‌లో ఎన్నికల ప్రచార చివరి బహిరంగ సభ ఉంటుంది.




Tags:    

Similar News