CM Revanth Reddy : నేడు సోనియా గాంధీ బర్త్డే.. సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేడు 78వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ చరిత్రలో మీ పేరు సువర్ణాక్షర లిఖితం. స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన సంకల్పం మీ సొంతం. తెలంగాణ తల్లి సోనియమ్మకు నాలుగు కోట్ల ప్రజల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’అంటూ చెప్పారు. ఈ ట్వీట్ కు తెలంగాణ సీఎంగా తనను ప్రకటించినప్పుడు సోనియా గాంధీతో దిగిన ఫొటోను రేవంత్ జత చేశాడు. ప్రధాని మోదీ సైతం సోనియా గాంధీకి ట్విట్టర్ వేదికగా బర్త్ విషెస్ తెలిపారు. కాగా టీకాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకను గాంధీ భవన్ లో ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 78 కిలోల కేక్ ను ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో పాటు మిగిలిన ఆరుగురు మంత్రుల ఎంపిక, వారి శాఖల ఏర్పాటుకు తుది నిర్ణయం తీసుకోనున్నారు. సోనియా గాంధీ పార్టీ పరంగా ఎంతో త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ప్రతీ జిల్లాలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను జరపాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ చరిత్రలో మీ పేరు సువర్ణాక్షర లిఖితం.
— Revanth Reddy (@revanth_anumula) December 9, 2023
స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన సంకల్పం మీ సొంతం.
తెలంగాణ తల్లి సోనియమ్మకు నాలుగు కోట్ల ప్రజల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #Soniamma pic.twitter.com/mzjTmpFrud