Revanth Reddy, : ఇవాళ కలెక్టర్లతో రేవంత్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

Byline :  Krishna
Update: 2023-12-24 01:45 GMT

ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్ సమావేశమవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆరు గ్యారంటీల అమలు, ప్రజా పాలన కార్యక్రమాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ప్రజా భవన్లో ప్రతీ మంగళ, శుక్ర వారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణిని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ల సమావేశంలో ప్రకటించే అవకాశముంది.

ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఆహ్వానించారు. డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 6వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటలవరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. అన్ని గ్రామ పంచాయితీలు, మున్సిపల్ వార్డులలో అధికారులతో కూడిన బృందాలు పర్యటిస్తాయి. ఈ గ్రామ సభల్లో వచ్చిన ప్రతీ దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించడానికి ఒక్కోదానికి ప్రత్యేకమైన నెంబర్ ఇవ్వడంతోపాటు వాటిని కంప్యూటరైజ్ చేస్తారు. కలెక్టర్ల సమావేశంలో భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొంటారుఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు.


Tags:    

Similar News