Jana Reddy : కాంగ్రెస్ దూకుడు.. జానారెడ్డి అధ్యక్షతన కీలక కమిటీ..

Byline :  Krishna
Update: 2023-10-11 08:44 GMT

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అవడంతో రాజకీయ వేడి పెరిగింది. గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల వేటలో ఉన్నాయి. ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థులను సరికొత్త విధానంలో ఎంపిక చేస్తోంది. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన హస్తం పార్టీ.. వాటిని వడపోసే కార్యక్రమంలో తలమునకలైంది. ఈ క్రమంలో అసంతృప్తులు పార్టీని వీడకుండా వారిని బుజ్జగించేందుకు అధిష్ఠానం ముందస్తు చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సయోధ్య కోసం కాంగ్రెస్ కీలక కమిటీ ఏర్పాటు చేసింది. (Kunduru Jana Reddy) జానారెడ్డి అధ్యక్షతన ఫోర్‌మెన్‌ కమిటీలో మాణిక్‌రావ్‌ ఠాక్రే, దీపాదాస్‌ మున్షీ, మీనాక్షి నటరాజన్‌ సభ్యులుగా ఉన్నారు. పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తరువాత టికెట్ రానివారిని, పార్టీలో అసంతృప్త నేతలను ఈ కమిటీ బుజ్జగించనుంది. ఇవాళ ఈ కమిటీ తొలి సమావేశం జరగనుంది. అసంతృప్తులు ఉన్న నియోజకవర్గాలపై సమీక్ష జరపనుంది.     


Tags:    

Similar News