Kathi Karthika : హరీశ్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న కత్తి కార్తీక

Byline :  Kiran
Update: 2023-11-17 06:26 GMT

కాంగ్రెస్ నేత కత్తి కార్తీక బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్ లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఆమె బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కార్తీక తనకు రోషం, కసి ఎక్కువని చెప్పారు. దుబ్బాకలో కాంగ్రెస్ ఉనికే లేకపోయినా ఆ పార్టీ జెండా మోసి కాపాడానని అన్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కత్తి కార్తీక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వల్ల కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతోందని అన్నారు. ఆడబిడ్డను కంటతడి పెట్టేలా చేశాడని రేవంత్పై మండిపడ్డారు. గౌరవంలేని చోట ఉండలేనని, అందుకే బీఆర్ఎస్ లో చేరానని కత్తి కార్తీక స్పష్టం చేశారు.

2021లో దుబ్బాక ఉప ఎన్నికలో ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరపున కత్తి కార్తీక పోటీ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి కీలకంగా వ్యవహరించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. అయినా పార్టీ ఆమెకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈసారి దుబ్బా టికెట్ ఇస్తారని ఆశించిన ఆమెకు కాంగ్రెస్ హైకమాండ్ మొండిచేయి చూపింది. టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కార్తీక కారెక్కినట్లు సమాచారం.




Tags:    

Similar News