Priyanka Gandhi : తెలంగాణలో కాంగ్రెస్ బస్సు యాత్ర.. ప్రియాంక గాంధీతో..

Byline :  Krishna
Update: 2023-10-06 12:21 GMT

ఎన్నికలు దగ్గరపడుతుండడంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ రాకముందు పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్ ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల వేటలో తలమునకలయ్యాయి. అభ్యర్థుల ప్రకటనతో సంబంధం లేకుండా కాంగ్రెస్ ప్రజల్లో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలుచోట్ల సభలు నిర్వహించిన హస్తం పార్టీ తాజాగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది.

అక్టోబర్ 14, 15 తేదీల్లో బస్సు యాత్ర స్టార్ట్ చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. 119 నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ఈ యాత్రకు ప్రణాళికలు చేస్తున్నారు. ఈ బస్సు యాత్రను కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో రెండు, మూడు రోజులు ఆమె పర్యటన ఉండే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే సైతం ఈ బస్సు యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. 18,19,20 తేదీల్లోరాహుల్‌ బస్సు యాత్రలో పాల్గొంటారని తెలుస్తోంది. వీరితో పాటు డీకే శివకుమార్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు బస్సు యాత్రలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News