తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలిచింది. అధికారం చేపట్టేందుకు సిద్ధం అయింది. కాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్, పలువురు టీకాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ తమిళిసైని కోరుతూ లేఖ అందిచారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. సోమవారం శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. అనంతరం సాయంత్రం ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.