మాకు న్యాయం చేయాలి.. ప్లకార్డులు పట్టుకొని నిరసనలు

Byline :  Veerendra Prasad
Update: 2023-10-09 03:26 GMT

టీ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే టికెట్‌ల గొడవ రోజురోజుకి తారస్థాయికి చేరుకుంటుంది. టికెట్లు ఆశిస్తున్న(Telangana Congress) ఓయూ నేతలు ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. ‘‘ఉద్యమ సమయంలో పోరాడినందుకు కేసులు మాకు.. టికెట్లు వేరేవాళ్లకా?” అంటూ వారు ప్రశ్నించారు. పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఆదివారం స్క్రీనింగ్ కమిటీ భేటీ అయిన జీఆర్ జీ రోడ్ లోని కాంగ్రెస్ ‘వార్ రూం’ ఎదుట వారు బైఠాయించారు. రాహుల్‌ గాంధీ జిందాబాద్‌.. సోనియా గాంధీ జిందాబాద్‌.. ప్రియాంక గాంధీ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల్లో తమకు సీటు కేటాయించాలని ‘మాకు న్యాయం చేయండి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ కు అనుగుణంగా యువతకు పెద్ద సంఖ్యలో సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో మానవత రాయ్ (సత్తుపల్లి టికెట్ ఆశావహుడు), దుర్గం భాస్కర్ (చెన్నూరు), రవి నాయక్ (దేవరకొండ) ఉన్నారు.




 


స్క్రీనింగ్ కమిటీ భేటీ అయి ఫైనల్ లిస్ట్ రూపొందిస్తోందన్న ప్రచారంతో పెద్ద ఎత్తున ఆశావహులు వార్ రూం ఎదుట వాలిపోయారు. ఒక్కో నియోజక వర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు నేతలు వచ్చారు. ఓబీసీ కోటా, మహిళ, ఓయూ స్టూడెంట్ల కోటా, కమ్మ కోటా, ఎన్నారై కోటా అంటూ టికెట్ల కోసం ఎదురు చూశారు. మీటింగ్ ప్రారంభమైన ఒక గంట పాటు సైలెంట్ గా ఉన్న నేతలు.. మధ్యాహ్నం 3 తర్వాత తమకు టికెట్ వస్తుందో, రాదో అన్న ఆందోళనలో కన్పించారు. ఓయూ స్టూడెంట్లు వార్ రూం మెయిన్ గేట్ ముందు బైఠాయించగా.. వారికి పోటీగా ఓబీసీ నేతలు రోడ్ పై కూర్చుని నిరసన తెలిపారు. బయటి పార్టీల నుంచి వచ్చే పారాచూట్ లీడర్లకు టికెట్లు ఇవ్వద్దని డిమాండ్ చేశారు




 




Tags:    

Similar News