Telangana Assembly 2023 : కాళేశ్వరం, మిషన్‌ భగీరథపై విచారణ జరపాలి : జీవన్ రెడ్డి

Byline :  Krishna
Update: 2023-12-16 09:01 GMT

మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై భారం పడకుండా కాంట్రాక్ట్ కంపెనీతోనే ప్రాజెక్టును పునరుద్ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. శాసనమండలిలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో మాట్లాడిన జీవన్‌ రెడ్డి.. కాళేశ్వరం ప్రాజెక్టను గత ప్రభుత్వం సాగునీటి కోసం వినియోగించకుండా.. పర్యాటకంగా వాడుకుందని విమర్శించారు. సాగు నీటి హక్కులు కాపాడటంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు.

కాళేశ్వరం, మిషన్‌ భగీరథపై విచారణ జరిపించాలని జీవన్ రెడ్డి కోరారు. కమీషన్ల కోసమే మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టారని ఆరోపించారు. అన్ని వసతులు ఉన్నా రామగుండం కాదని యాదాద్రిలో పవర్‌ ప్లాంట్‌ పెట్టారన్నారు. విద్యుత్‌ శాఖలో 80 వేల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలన్నారు. కేంద్రం వివక్ష వల్ల ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించలేకపోయామని చెప్పారు. కృష్ణా జలాలు కాపాడుకోవడంలో గత ప్రభుత్వం తరహాలో ఉదాసీనత తగదన్న ఆయన కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవాలని సూచించారు.


Tags:    

Similar News