TS Assembly Elections 2023 : కొత్త ప్రభాకర్పై దాడి ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలి - రేవంత్ రెడ్డి

Byline :  Kiran
Update: 2023-10-30 12:02 GMT

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ దాడిని పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. కాంగ్రెస్ హింసను ఎప్పుడూ నమ్ముకోదని స్పష్టం చేశారు. తమ పార్టీ అహింస మూల సిద్ధాంతంగా పనిచేస్తున్నదని చెప్పారు.

కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి చేసిన వ్యక్తి ఎవరైనా కేసు నమోదుచేయాలని రేవంత్ అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చెప్పారు. దాడికి సంబంధించి పారదర్శకంగా విచారణ జరిపి అన్ని విషయాలు బయటపెట్టాలని అన్నారు.




Tags:    

Similar News