Telangana Assembly : 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం

Byline :  Veerendra Prasad
Update: 2023-12-20 06:28 GMT

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర డిప్యూటీ సీఎం.. నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. దశాబ్దకాలంలో జరిగినటువంటి ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు. 42 పేజీల ఈ శ్వేతపత్రంలో.. రాష్ట్ర ప్రభుత్వం మెుత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు ఉన్నాయి. 2014 -15 నాటికి రాష్ట్ర రుణం రూ.72,658 కోట్లుగా చూపించారు. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం అప్పు పెరిగింది. 2015-16లో రాష్ట్ర రుణ, జీఎస్డీపీ 15 .7 శాతంతో దేశంలోనే అత్యల్పంగా ఉన్నది. 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లుగా ఉంది.


ఇక ఈ శ్వేతపత్రంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే స్పందిస్తూ.. 42 పేజీల పుస్తకం ఇచ్చి ఇప్పుడు మాట్లాడాలి అంటే ఎలా? అని ప్రశ్నించారు. నివేదికను చదివే సమయం కూడా మాకు ఇవ్వలేదని మండిపడ్డారు. ముందు రోజే డాక్యుమెంట్‌ ఇచ్చి ఉంటే బాగుండేదని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే సమాధానం సంతృప్తి కలిగించకపోతే నిరసన చేసే అవకాశం ఉందన్నారు. సభను హుందాగా నడిపేందుకు బీఆర్ఎస్ పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో అరగంట పాటు సభను వాయిదా వేసి టీ బ్రేక్‌ ఇచ్చారు స్పీకర్‌ గడ్డం ప్రసాద్.




Tags:    

Similar News