TS Assembly Elections 2023 : ఓట్ల లెక్కింపు కోసం ముమ్మర ఏర్పాట్లు.. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత
తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. పోలింగ్ ముగిసినందున ఇక ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపుపై దృష్టి సారించారు. జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌ల్లో భద్రపరచారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో పలు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు ఆయా గదుల వద్ద ఆంక్షలు విధించారు. స్ట్రాంగ్ రూం పరిసర ప్రాంతాల్లో144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జిల్లాలవారీగా కౌంటింగ్ కేంద్రాల వివరాలివే..