Assembly Election 2023 : ప్రచారం బంద్.. ఆ నియోజకవర్గాల్లో గంట ముందే..

Byline :  Kiran
Update: 2023-11-28 10:30 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 13 నియోజకవర్గాల్లోప్రచార గడువు ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటింగ్కు 48గంటల ముందు సైలెన్స్ పీరియడ్ షురూ కానుంది. అయితే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకుగాను 13 స్థానాల్లో 30వ తేదీ సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. దీంతో ఆ 13 నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 4 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది.

సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటలకు ప్రచార గడువు ముగిసింది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5గంటలకు క్యాంపెయినింగ్ బంద్ కానుంది. క్యాంపెయినింగ్ ముగిసిన వెంటనే ఆంక్షలు అమల్లోకి రానున్నారు. రాజకీయపార్టీలు ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు నిషేధించడంతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. క్యాంపెయినింగ్ ముగిసిన వెంటనే స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. 




Tags:    

Similar News