Etala Rajender : ఆషామాషీగా చెప్పడం లేదు.. కేసీఆర్ను ఓడిస్తా : ఈటల

Byline :  Bharath
Update: 2023-10-16 10:15 GMT

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పార్టీలన్నీ ఎమ్మెల్యే అభ్యర్థులు, హామీలను ప్రకటిస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో జమ్మికుంటలో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆ సభలో పాల్గొన్న హుజురాబాద్ ఎమ్మెల్యే  (Etala Rajender) ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా.. హుజురాబాద్ గడ్డపై ఎగిరేది కాషాయం జెండానేనని స్పష్టం చేశారు. తనపై హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని తెలిపారు. ప్రభుత్వ హామీలు కావాలంటే ప్రజలు బీఆర్ఎస్ లో చేరాలని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమి లేదని, ప్రజల సొమ్మును దోచుకుని అక్రమంగా సంపాదించిందని ఆరోపించారు.

గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని తాను ఆషామాషీగా చెప్పట్లేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. గజ్వేల్ నుంచి కచ్చితంగా పోటీ చేసి కేసీఆర్ ను ఓడించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు బీఆర్ఎస్ రూ. 100 కోట్లు ఖర్చు పెట్టిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలంతా కలిసి దౌర్జన్యం చేసినా.. ప్రజలు తనపైనే నమ్మకముంచి గెలిపించారని గుర్తుచేశారు. అప్పుడే కేసీఆర్ ను ఓడించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పారు. దమ్ముంటే 




Tags:    

Similar News