Etala Rajender : హంగ్ పక్కా.. బీజేపీ 25 నుంచి 30 సీట్లలో గెలుస్తుంది: ఈటల

Byline :  Bharath
Update: 2023-11-30 15:38 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. దాదాపు 73 శాతం పోలింగ్ జరిగింది. ఒక్కో సర్వే ఒక్కో పార్టీ గెలుస్తుందని రిపోర్టులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశముందని స్పష్టం చేశారు. బీజేపీ 25 నుంచి 30 సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆఖరన సంకీర్ణ రాజకీయాల్లో ఏమవుతుందో చూడాలని చెప్పారు. ఏది ఏమైనా బీజేపీ మాత్రం బీఆర్ఎస్ తో కలిసేది ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. గురువారం పోలింగ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో ఈ సారి హంగ్ రావచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ కింగ్ మేకర్‌ కాబోతుందన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకలత ఉందో గజ్వేల్ నియోజకవర్గంతో తిరిగితే అర్థం అవుతుందని చెప్పారు. కేసీఆర్ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటని ధ్వజమెత్తారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నాడని.. రెండు చోట్లా కేసీఆర్ ఓటమి ఖాయని స్పష్టం చేశారు. ఈటల వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, ఈ ఎన్నికల్లో ఈటల హుజూరాబాద్, గజ్వేల్ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.




Tags:    

Similar News