Divyavani : కాంగ్రెస్‌లో చేరిన టాలీవుడ్ సీనియర్ నటి

Byline :  Veerendra Prasad
Update: 2023-11-22 04:55 GMT

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ అసంతృప్తులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా బుధవారం ప్రముఖ సినీనటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక, దివ్య వాణి 2019లో టీడీపీలో చేరారు. 2022 మే 31న తేదీన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా దివ్యవాణి సోషల్ మీడియాలో ప్రకటించారు.

టీడీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆమె బీజేపీలో చేరారు. బీజేపీలో కూడ ఆమె ఇమడలేకపోయారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే బీజేపీ నుండి విజయశాంతి కూడ బయటకు వచ్చారు. ఇటీవలే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దివ్యవాణి కూడ బీజేపీ నుండి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొనడంతో ఆమె కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వరుస చేరికలతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ సినిమా గ్లామర్ ను క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో దివ్యవాణిని పార్టీలో చేర్చూకుంది. మరి ఆమెకు పార్టీలో ఏ స్థానం కల్పిస్తారనేది ఆసక్తిగా మారింది. సినీ నటిగా ఉన్న దివ్యవాణి సేవలను తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ వినియోగించుకొనే అవకాశం లేకపోలేదు.




Tags:    

Similar News