Balasani Laxminarayana : బీఆర్ఎస్‌కు మరో షాక్.. మాజీ ఎమ్మెల్సీ రాజీనామా

Byline :  Veerendra Prasad
Update: 2023-10-15 06:34 GMT

తెలంగాణలో ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ (Balasani Lakshminarayana) పార్టీకి రిజైన్ చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపించారు. గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తిలో ఉన్న బాలసాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) ఆయన్ను భద్రాచలం బీఆర్ఎస్ ఇంఛార్జ్ పదవి నుంచి తప్పించి ఆ అవకాశాన్నిఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌కు ఇవ్వడమే అందుకు కారణమని స్థానికులు చెప్పుకుంటున్నారు. గతంలోనూ స్ధానిక సంస్థల సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు బాలసానికి ఇవ్వకుండా తాతా మధుసూదన్‌కు పార్టీ అదిష్ఠానం అవకాశం ఇచ్చింది. దీంతో గత కొద్ది రోజులుగా బాలసాని బీఆర్ఎస్‌పై అలక వహించారు

అయితే, బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ లక్ష్మీ నారాయణ.. హస్తం గుటికి చేరబోతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే బాలసానిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆయన ఇంటికి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswararao), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) వెళ్లనున్నారు.

అయితే, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ బీఆర్ఎస్ పార్టీ వీడటంతో ఖమ్మం బీఆర్ఎస్ నేతలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ అధిష్టానం బాలసానికి సముచిత స్థానం కల్పించినప్పటికి.. ఇప్పుడు పార్టీకి ద్రోహం చేసి పోతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలి కానీ, ఎన్నికల సమయంలో పార్టీకి రాజీనామా చేసి నష్టం చేకూర్చేలా ప్రవర్తించడం సరికాదని బీఆర్ఎస్ శ్రేణులు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణపై విమర్శలు గుప్పిస్తున్నారు.




Tags:    

Similar News