CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటీ
సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్.. ఆదివారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, అందుకు తగిన సలహాలు ఇచ్చేందుకు ఈ భేటి జరిగినట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్.. సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణా రావు, సీఎం సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు.
కాగా రెండు రోజుల క్రితం రాఘురాం రాజన్.. ప్రభుత్వాలు దివాలా తేసే స్థాయిలో ఉచితాలు ఇవ్వొద్దని, ఉంటే నిరుపేదలకు ఉపయోగపడే ఉచితాలు సమర్థనీయమేనని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉచితాలు ఇస్తున్నాయని, అది సరికాదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.