Ram Reddy : బీజేపీకి రాజీనామా చేసిన మరో సీనియర్ నేత

Byline :  Bharath
Update: 2023-11-02 02:24 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీజేపీకి వరుస షాక్ లు తగుతున్నాయి. కీలక నేతలు ఒక్కరొక్కరుగా పార్టీ వీడుతున్నారు. బుధవారం ఒక్కరోజే దాదాపు నలుగురు సీనియర్ నేతలు బీజేపీకి రాజీనామా చేశారు. వివేక్ వెంకటస్వామి, ఆయన కుమారుడు రాజీనామా చేసిన సమయంలోనే మరో లీడర్ పార్టీని వీడారు. బీజేపీ సీనియర్ నేత ఫ్రపుల్ రాంరెడ్డి కూడా నిన్న ఆ పార్టీకి రాజీనామా చేశారు. చిక్కడపల్లిలోని తన ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి తన రాజీనామా లెటర్ ను పంపించినట్లు సమావేశంలో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైంలో ముషీరాబాద్ సెగ్మెంట్ పరిధిలోని డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్ల గెలుపు కోసం ఎంతో కృషిచేసినట్లు చెప్పుకొచ్చారు. బీజేపీలో కొనసాగితే తనకు సరైన న్యాయం జరగదని భావించి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పుకొన్నారు.




Tags:    

Similar News