Gaddam Prasad Kumar : తెలంగాణ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్
Byline : Krishna
Update: 2023-12-07 07:14 GMT
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎంపికయ్యారు. వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రసాద్ కుమార్ను స్పీకర్గా నియమిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. రేవంత్తో పాటు స్పీకర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు. 2008 ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున వికారాబాద్ నుంచి పోటీ చేసిన గడ్డం ప్రసాద్ టీడీపీ అభ్యర్థిపై గెలిపొంది అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు. ఇక 2009 సాధారణ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 2012లో కిరణ్ కుమార్ కేబినెట్లో టెక్స్ టైల్ శాఖ మంత్రిగా పనిచేశాడు. అయితే 2014,2018 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్ పై గెలిపొందిన ఆయన్ను అధిష్ఠానం స్పీకర్గా నియమించింది.