TS Assembly Elections 2023 : రాజకీయ కుట్ర కోణంలో దర్యాప్తు జరిపిస్తాం - హరీష్ రావు
Byline : Kiran
Update: 2023-10-30 10:29 GMT
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని చెప్పారు. ఈ ఘటనను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్కు తరలించామని అన్నారు.
ప్రభాకర్ రెడ్డికి కత్తిపోటు కారణంగా పొట్టలో గాయాలయ్యాయని హరీష్ రావు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కేడర్ ఎలాంటి ఆందోళనకు గురికావద్దని చెప్పారు. ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, హత్యాయత్నం ఘటనలో రాజకీయ కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.