TS Assembly Elections 2023 : ఉమ్మడి జిల్లాలవారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..?

Byline :  Krishna
Update: 2023-12-04 02:14 GMT

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. గత ఎన్నికల్లో 19 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ ఈ సారి దుమ్మురేపింది. 64 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో పదేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనుంది. అటు బీఆర్ఎస్ 39 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ ఒక స్థానంలో గెలిచాయి. ఇక ఉమ్మడి జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే...

హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండగా.. బీఆర్ఎస్ 7, ఎంఐఎం 7, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించాయి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో 14 నియోజకవర్గాలకు గానూ.. బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 4 స్థానాలను కైవసం చేసుకున్నాయ.ి

ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలుండగా బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలుపొందాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా.. స్టేషన్ ఘనపూర్, జనగామ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లకు గాను కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించగా.. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గెలిచారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 1, సీపీఐ ఒక స్థానంలో గెలుపొందింది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా.. కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 2 స్థానాల్లో గెలిపొందాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలకుగానూ కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5 స్థానాల్లో విజయం సాధించింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ 4, బీజేపీ 4, బీఆర్ఎస్ 2 స్థానాల్లో గెలిచాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ 4, బీజేపీ 3, బీఆర్ఎస్ 2 స్థానాలను కైవసం చేసుకున్నాయి.


Tags:    

Similar News