ఎలక్షన్ కోడ్.. ఇప్పటి వరకు ఎంత మొత్తం పట్టుబడిందంటే..!

Byline :  Kiran
Update: 2023-10-17 16:55 GMT

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తీసుకెళ్తున్న నగదు, బంగారం, మద్యంపై నిఘా పెంచారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి జరిపిన తనిఖీల్లో పోలీసులు ఇప్పటి వరకు భారీగా నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి ఈ రోజు ఉదయం 8 రోజుల వ్యవధిలో పట్టుబడ్డ నగదు, ఇతర వస్తువుల విలువ రూ.130 కోట్లు దాటడం విశేషం.

నగదు

మంగళవారం ఒక్క రోజే పోలీసులకు రూ.12,58,59,177 నగదు పట్టుబడింది. అక్టోబర్ 9 నుంచి నిన్నటి వరకు సోదాల్లో దొరికిన రూ. 71,55,58,094 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు.

మద్యం

నిన్న ఒక్కరోజు రూ.1,10,98,610 కోట్ల విలువైన మద్యం పట్టుబడింది. అందులో మద్యం 7998 లీటర్లు కాగా.. 625 కిలోల నల్ల బెల్లం ఉంది. అక్టోబర్ 9 నుండి నిన్నటి వరకు పట్టుబడిన మద్యం విలువ రూ.7,75,79,917 కోట్లు.

మత్తు పదార్థాలు

మంగళవారం ఒక్కరోజు పట్టుబడిన పట్టుబడిన మత్తు పదార్థాలు విలువ రూ.1,60,43,125 కోట్లు కాగా అక్టోబర్ 9 నుండి నిన్నటి వరకు 1694 కిలోల గంజాయి పట్టుకున్నారు. దాని విలువ రూ.4,58,04,720 కోట్లు.

బంగారం, వెండి

పోలీసుల తనిఖీల్లో నిన్న ఒక్కరోజు పట్టుబడ్డ బంగారం విలువరూ.4,93,88,430 కోట్లు. అక్టోబరు 9 పట్టుబడిన వాటి విలువ 40,08,44,300 కావడం విశేషం.

వస్తువులు

నిన్న ఒక్కరోజే రూ.1,61,02,900 కోట్ల విలువైన వస్తువులను పట్టుకున్నారు. అక్టోబర్ 9 నుండి మంగళవారం వరకు రూ.6,29,04,500 కోట్ల విలువైన బియ్యం, చీరలు, కుట్టు మిషన్లు, కుక్కర్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

మంగళవారం ఒక్కరోజు స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం, బంగారం తదితర వస్తువుల మొత్తం విలువ రూ.21,84,92,242 కోట్లు కాగా.. 8రోజుల్లో మొత్తం సీజ్ చేసిన వాటి వాల్యూ రూ.130,26,91,531 కోట్లు కావడం గమనార్హం.




Tags:    

Similar News