TS Assembly Elections 2023 : తెలంగాణ ఎన్నికలు.. వందల కోట్లు సీజ్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలనూ ఉపేక్షించడం లేదు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి జరిపిన తనిఖీల్లో పోలీసులు ఇప్పటి వరకు భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 286.74 కోట్లు దాటినట్లు అధికారులు చెప్పారు.
గడిచిన 24 గంటల్లో నిన్న ఒక్కరోజే తనిఖీల్లో రూ. 42 కోట్ల 93 లక్షల విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 9 నుంచి ఇప్పటి వరకు రూ. 96 కోట్ల నగదు పట్టుబడగా, స్వాధీనం చేసుకున్న బంగారం, ఆభరణాల విలువ రూ. 149.14 కోట్లు. దీంతో పాటు రూ. 12 కోట్ల విలువైన మద్యం, రూ. 9 కోట్ల విలువైన డ్రగ్స్, రూ. 19 కోట్లకు పైగా విలువైన ఇతర కానుకలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.