KA Paul : కేసీఆర్‌ను పరామర్శించిన కేఏ పాల్

Byline :  Krishna
Update: 2023-12-12 10:42 GMT

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. మరోసారి కేసీఆర్‌ వద్దకు ప్రేయర్ ఆయిల్ తీసుకని వస్తానని.. దాంతో కేసీఆర్ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందన్నారు. కేటీఆర్‌ను తను ఇదే మొదటి సారి కలిశానని.. బాగా రిసీవ్ చేసుకున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రావడం కేసీఆర్‌ను పరామర్శించడం.. చాలా మంచి పరిణామం అన్నారు.

మరోవైపు కేసీఆర్కు పరామర్శల వెల్లువ కొనసాగుతోంది. సోమవారం ఆయన్ని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, నటుడు ప్రకాశ్ రాజ్ దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, మాజీ మంత్రులు మల్లారెడ్డి, గంగుల కమలాకర్ యశోదా ఆసుపత్రికి వచ్చి కేసీఆర్ను పరామర్శించారు. సీఆర్ ఆరోగ్య వివరాలను ఆయన తనయుడు కేటీఆర్, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.


Tags:    

Similar News