Shivakumar : తెలంగాణలో ఇస్తే తప్పేంటి? కర్నాటక డిప్యూటీ సీఎం
తెలంగాణలో పత్రికల్లో ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు సరైనవేని, అన్ని రాష్ట్రాల్లో ఇచ్చినేట్టే ఆ రాష్ట్రంలోనూ ఇచ్చామని కర్నాటక ఉప ముఖ్యమంద్రి డీకే కేశవకుమార్ అన్నారు. సాధించిన విజయాలు అన్ని పార్టీలూ చెప్పుకుంటాయని, తాము చెప్పుకోవంలో తప్పేముందని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటను ఇవ్వడం కాదంటూ బీజేపీ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం కర్నాటక ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. వీటిపై డిప్యూటీ సీఎం స్పందించారు.
‘‘మేం తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని అడగలేదు. మా రాష్ట్రంలోని విపక్షాలు ఎన్నికల్లో మేం ఇచ్చిన ఆరు గ్యారంటీలు సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శిస్తున్నాయి. వాటికి జవాబు చెప్పడానికే యాడ్స్ ఇచ్చాం. ఇందులో ఎన్నికల కోడ్ ఉల్లంఘనేమీ లేదు. ఏం ఓట్లు వేయడమని ఎవరినీ కోరలేదు. కర్నాటతోపాటు ఇతర రాష్ట్రాల్లోని పత్రికలకూ ప్రకటనలు ఇచ్చాం. ఓట్లు కోరి వుంటే తప్పవుతుంది తప్ప మా విజయాలు చెప్పుకోవడం తప్పెలా అవుతుంది? అన్ని పార్టీలూ చేసే పనే మేమూ చేశాయి. ఈ సంగతి ఈసీకి వెల్లడిస్తాం’’ అని ఆయన అన్నారు.