Harish Rao : గురుకులాలను డిగ్రీ వరకు అప్ గ్రేడ్ చేస్తాం - హరీశ్ రావు

Byline :  Kiran
Update: 2023-11-19 12:39 GMT

బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే 119 నియోజకవర్గాల్లో ఓసీ గురుకులాలు ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్ర గురుకులాల పేరెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏండ్లలో 286 గురుకులాలు ఏర్పాటు చేస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్యను కేసీఆర్ వెయ్యికి పెంచారని చెప్పారు.

గతంలో గురుకులాల్లో 1.90లక్షల మంది విద్యార్థులు చదవితే.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్య 6లక్షలకు పెరిగిందని హరీశ్ రావు స్పష్టం చేశారు. గురుకుల పాఠశాలలను పదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు అప్‌ గ్రేడ్‌ చేశామని, మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇంటర్‌ నుంచి డిగ్రీకి అప్‌గ్రేడ్‌ చేస్తామని ప్రకటించారు.

కాంగ్రెస్‌ నాయకులకు ఏం జరుగుతుందో తెలియకుండానే మేనిఫెస్టో విడుదల చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకాలిచిప్ప ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని చెప్పారు. ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో ఉచితంగా మోకాలిచిప్ప ఆపరేషన్లు చేస్తున్న విషయాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు.




Tags:    

Similar News