KCR : కామారెడ్డిలో మూడో స్థానానికి పడిపోయిన కేసీఆర్

Byline :  Kalyan
Update: 2023-12-03 10:35 GMT

గత కొన్ని రోజులుగా రాష్ట్రం మొత్తం చూసింది కామారెడ్డి నియోజకవర్గం వైపే. ఈ స్థానంలో కేసీఆరే గెలుస్తారని ధీమా వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలకు షాక్ తగిలింది. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. వీరిద్దరికి దీటుగా పోటినిచ్చారు బీజేపీ అభ్యర్థి కోటిపల్లి వెంకటరమణారెడ్డి. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయడంతో పాటు తాను పుట్టిన నియోజకవర్గమంటూ సెంటిమెంట్ రాజేసినా పనిచేయలేదు. గెలుపు కాదు కదా కనీసం రెండో స్థానం కూడా కేసీఆర్ కు దక్కలేదు. గజ్వేల్, కామారెడ్డిల్లో పోటీ చేసిన కేసీఆర్, గజ్వేల్ లో గెలుపొందినా.. కామారెడ్డిలో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీలలో ఎవరైనా గెలవచ్చు కానీ.. కేసీఆర్ లాంటి వ్యక్తి మూడో స్థానానికి పరిమితం కావటం కొంత ఆలోచించాల్సిన విషయం.


 


Tags:    

Similar News