TS Assembly Elections 2023 : కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Byline :  Krishna
Update: 2023-10-20 12:29 GMT

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ప్రధాన పార్టీల నేతల జంపింగ్లతో రాజకీయం రంజుగా సాగుతోంది. అధికార పార్టీలొ అసంతృప్తులు, ఆశావహులు కారు దిగి, ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. తాజాగా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె హస్తం కండువా కప్పుకున్నారు.




 


కాగా ఈసారి ఖానాపూర్ బీఆర్ఎస్ టికెట్ గులాబీ బాస్ జాన్సన్ నాయక్కు ఇచ్చారు. అప్పటినుంచే రేఖానాయక్ పార్టీ మారుతారని ప్రచారం జరగ్గా.. ఎట్టకేలకు ఆమె కాంగ్రెస్ గూటికి చేరారు. . బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని రేఖా నాయక్ ఇప్పటికే ప్రకటించారు. 2009లో రాజకీయ అరంగేట్రం చేసిన రేఖా నాయక్.. కాంగ్రెస్ తరఫున ఆసిఫాబాద్ జెడ్పీటీసీగా విజయం సాధించారు. 2013లో బీఆర్ఎస్లో చేరారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రితేష్ రాథోడ్పై 30వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్పై 24,300 ఓట్ల మెజారిటీతో గెలిపొందారు.


Tags:    

Similar News