Komatireddy Venkat Reddy : సీఎం పదవిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Byline :  Veerendra Prasad
Update: 2023-11-07 09:37 GMT

సీఎం పదవిపై భువనగిరి ఎంపీ, నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసే ముందు.. భారీ ఊరేగింపుంలో భాగంగా ఎంపీ మాట్లాడుతూ.. నల్గొండ నుంచి కోమటిరెడ్డి సీఎం అయ్యే రోజు వస్తుందన్నారు. ఏదో ఒకరోజు సీఎం మాత్రం అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడే సీఎం కావాలనే తొందర తనకు లేదన్నారు.

అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిందని విమర్శలు గుప్పించారు. ఏపీలో నష్టం జరగుతుందని తెలిసిన సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. కానీ తెలంగాణలోప్రజల ఆకాంక్షలు నేరవేరలేదని ధ్వజమెత్తారు. ఆత్మహత్యల కోసం కాదు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని బీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యారు. ఉద్యోగ ఖాళీల భర్తీలో బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయిందని మండిపడ్డారు. పోలింగ్ చివరి రోజు బీఆర్ఎస్ రైతు బంధు డబ్బులు వేస్తారు.. అయిన మోసపోవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ నేతలు ఎంతోమందిని ఇబ్బంది పెట్టారని.. నల్లగొండను నాశనం చేశారని నిప్పులు చెరిగారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.      




Tags:    

Similar News