Komatireddy Venkat Reddy : సీఎంగా రేవంత్‌ రెడ్డి.. కోమటిరెడ్డి రియాక్షన్ ఇదే..

Byline :  Krishna
Update: 2023-12-06 02:56 GMT

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో గురువారం ఉదయం 10.28 గంటలకు గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ క్రమంలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ కీలక నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్కు స్పెషల్ విషెస్ చెప్పారు. రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాస్వామిక, ప్రజానుకూల ప్రభుత్వ పాలన రాబోతోందని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామిక విధానాలే అమలవుతాయని తెలిపారు. ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి నిర్ణయాలే పార్టీకి బలమన్న ఆయన.. ఈ సిద్ధాంతాలతోనే కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకుని, అధిష్ఠానానికి తీర్మానం పంపారని చెప్పారు.

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ ఆధ్వర్యంలో తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. నిన్న హైకమాండ్ పిలుపుతో హుటాహుటిన ఆయన ఢిల్లీ వెళ్లారు. కేబినెట్లో ఎవరిని తీసుకోవాలి.. ఎవరికి ఏ పదవి కేటాయించాలనే దానిపై రేవంత్ రెడ్డితో చర్చించనున్నారు. అన్నీ కుదిరితే రేపటిలోగా మంత్రివర్గాన్ని సైతం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు తన ప్రమాణస్వీకారానికి రావాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను రేవంత్ ఆహ్వానించారు.


Tags:    

Similar News